తైవాన్ కు చైనా నుంచి పొంచి ఉన్న ప్రమాదం.. అండగా ఉంటామన్న యూరోపియన్ యూనియన్

జిత్తులమారి చైనా తైవాన్ ను కబలించాలని చూస్తోంది. ఇటీవల తైవాన్ గగనతలంలోకి తమ యుద్ధవిమానాలకు పంపి ఉద్రిక్తతలకు తెర లేపింది చైనా. తైవాన్ లొంగకపోతే సైనిక చర్య ద్వారా అయినా బలవంతంగా ఆక్రమించుకోవాలని చూస్తోంది డ్రాగన్ కంట్రీ. అయితే ఇటీవల తైవాన్ దేశానికి తాము అండగా ఉంటామని అమెరికా భరోసా ఇచ్చింది. తాజాగా అలాంటి ప్రతిపాదననే యూరోపియన్ యూనియన్ చేసింది. తాము తైవాన్ దేశానికి అండగా ఉంటామని తెలిపింది.

యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ సభ్యుల గ్రూప్ మూడు రోజుల పాటు తైవాన్ లో పర్యటించనున్నారు. తైవాన్, యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం సంబంధాలను మరింతగా మెరుగు పరుచుకోవాడానికే పర్యటన సాగుతోందని యూరోపియన్ యూనియన్ చెబుతోంది. ’ తైవాన్ ఒంటరి కాదు.. యూరోపియన్ యూనియన్ మీతోనే ఉంటుందని‘ యూరోపియన్ యూనియన్ ఎంపీలు స్పష్టం చేశారు. తైవాన్ అధ్యక్షురాలు సామ్ ఇంగ్ వెన్ తో జరిగిన సమావేశంలో యూరోపియన్ యూనియన్ చైనా నుంచి ఎదురయ్యే సవాళ్లను నుంచి మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు.