న్యూజిలాండ్ తో టీమిండియా టెస్టు సిరిస్ ఆడ బోతున్న విషయం తెలిసిందే. ఇప్పటి కే బీసీసీఐ జట్టు ను కూడా ప్రకటించింది. ఈ జట్టు లో వైస్ కెప్టెన్ గా చతేశ్వర్ పుజారా ఉన్నాడు. అయితే న్యూజిలాండ్ తో జరగబోయే టెస్టు సిరిస్ పై పుజారా స్పందించాడు. ఈ సిరిస్ లో తాను ఎలగైనా సెంచరీ చేస్తా నని దీమా వ్యక్తం చేశాడు. తన టెస్టు కెరీర్ లో సెంచరీ కొట్టి చాలా రోజుల అవుతుందని అన్నారు.
గతంలో ఎప్పుడూ కూడా ఇంత గ్యాప్ రాలేదని అన్నాడు. ఈ సిరీస్ లో తప్పకుండా సెంచరీ చేస్తానని అన్నాడు. కాగ చాలా బలమైన జట్టు అయిన న్యూజి లాండ్ పై సెంచరీ కష్టమని అన్నాడు. అయినా.. కివీస్ తో జరగబోయే టెస్టు సిరీస్ స్వ దేశంలో కాబట్టి పూర్తి ఆధిపత్యం మనదే ఉంటుందని అన్నాడు. కాగ టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ చతేశ్వర్ పుజారా చివరి సెంచరీ 2019 లో ఆస్ట్రేలియా జట్టు పై చేశాడు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు సెంచరీ చేయలేదు. ఇప్పటి వరకు దాదాపు 1055 రోజులు అవుతుంది. కాగ న్యూజిలాండ్ తో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది.