ర‌వీంద్ర జ‌డేజా స్ట‌న్నింగ్ త్రో.. స్టీవ్ స్మిత్ ర‌నౌట్‌.. వీడియో..!

భార‌త క్రికెట్ జ‌ట్టులో అద్భుత‌మైన ఫీల్డ‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా ఒక‌డు. ఏ మ్యాచ్‌లో అయినా స‌రే అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తాడు. ఇప్ప‌టికే అనేక మ్యాచ్‌లలో అద్భుత‌మైన క్యాచ్‌లు ప‌ట్ట‌డంతోపాటు అనేక మంది బ్యాట్స్‌మెన్‌ల‌ను డైరెక్ట్ త్రో తో ర‌నౌట్ చేశాడు. ఇక తాజాగా సిడ్నీలో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మ‌న్ స్టీవ్ స్మిత్‌ను కూడా జ‌డేజా అద్భుత‌మైన త్రో తో ర‌నౌట్ చేశాడు.

ravindra jadeja stunning throw to get rid of steve smith for run out

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ స‌మ‌యంలో స్టీవ్ స్మిత్ సెంచ‌రీ చేసి 131 ప‌రుగుల స్కోరు వ‌ద్ద కొన‌సాగుతుండ‌గా బుమ్రా వేసిన బంతిని స్మిత్ ఆడాడు. ఈ క్ర‌మంలో బంతి స్క్వేర్ లెగ్ వైపు వెళ్లింది. అయితే స్మిత్ రెండో ప‌రుగు కోసం య‌త్నించ‌గా జ‌డేజా మైదానంలో అత్యంత వేగంగా క‌దులుతూ చాలా దూరం నుంచి వికెట్ల వైపు బంతిని విసిరాడు. దీంతో బంతి స్టంప్స్‌ను గిరాటేసింది. ఈ క్ర‌మంలో స్మిత్ ర‌నౌట్ అయ్యాడు.

కాగా జ‌డేజా ఈ మ్యాచ్‌లో ఆసీస్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 4 కీల‌క వికెట్ల‌ను కూడా తీశాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ ల‌బుషేన్‌, వేడ్‌, క‌మ్మిన్స్‌, ల‌యాన్‌ల‌ను అత‌ను ఔట్ చేశాడు. ఈ క్ర‌మంలో శ్రీ‌లంక (5/152), సౌతాఫ్రికా (6/138) త‌రువాత ఇప్పుడే (4/62) టెస్టుల‌లో జ‌డేజా అత్యుత్త‌మ బౌలింగ్ గ‌ణాంకాల‌ను న‌మోదు చేశాడు. కాగా జ‌డేజా అద్భుత‌మైన ఫీల్డింగ్‌కు నెటిజ‌న్లు అత‌న్ని ప్ర‌శంసిస్తున్నారు. అత‌ను స్మిత్‌ను ర‌నౌట్ చేసిన వీడియో వైర‌ల్‌గా మారింది.