భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్ తదితరులు కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి, బయో సెక్యూర్ బబుల్ ప్రోటోకాల్‌ను బ్రేక్ చేసి తాజాగా మెల్‌బోర్న్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఫుడ్‌ను తిన్న విషయం విదితమే. అయితే వారు తిన్న ఆహారానికి అయిన బిల్‌ను నవల్‌దీప్ సింగ్ అనే ఫ్యాన్ చెల్లించాడు. ఈక్రమంలో అతను బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేయగా, ముందు అంతగా ఎవరూ పట్టించుకోలేదు కానీ.. ఓవైపు టెస్ట్ సిరీస్ జరుగుతుండగా, మరో వైపు బయో సెక్యూర్ బబుల్‌ను విడిచిపెట్టి క్రికెటర్లు అలా నిర్లక్ష్యంగా తిరగడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతోపాటు ఫ్యాన్స్ కూడా విమర్శించారు. అయితే ఇప్పుడు మళ్లీ అదే అంశంలో తాజాగా ఇంకో వివాదం నెలకొంది.
రోహిత్ శర్మతోపాటు ఇతర క్రికెటర్లు బీఫ్ తిన్నారంటూ అదే సంఘటనకు చెందిన రెండో బిల్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ బిల్ వారు తిన్న ఆహారాలదేనా, వేరేదా అన్న విషయంలో స్పష్టత రాలేదు. కానీ వారే తిన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతోంది. దీంతో రోహిత్ శర్మను బీఫ్ తిన్నందుకు ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు.
He becomes Animal Activist on Holi and Diwali to lecture Hindus.
On other days, he and his team eat beef.
According to him, celebrating Holi and Diwali is irresponsibility towards animals.
But eating beef and subsidizing cow slaughter is Animal Activism.
Hypocrite @ImRo45 https://t.co/w0gJQq96sJ pic.twitter.com/ljrMPEQKTI
— Bharadwaj (@BharadwajSpeaks) January 2, 2021
ఓ వైపు హోలీ, దీపావళి పండుగల సందర్భంగా జంతువులకు ఏం కాకూడదు అని చెప్పి రోహిత్ శర్మ పోస్టులు పెడతాడని, కానీ అందుకు విరుద్ధంగా బీఫ్ ఎలా తింటాడని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మళ్లీ ఆ సంఘటనలో ఇంకో వివాదం తెరపైకి వచ్చింది. అయితే దీన్ని క్రికెటర్లు లేదా బీసీసీఐ కొట్టి పారేస్తారా, ఏదైనా స్పష్టత ఇస్తారా.. అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి మొత్తం 5 మంది క్రికెటర్లను ఐసొలేషన్‌లో ఉంచారు. కాగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఈ నెల 7వ తేదీ నుంచి సిడ్నీలో 3వ టెస్టు జరగనుంది. సిరీస్‌లో ఒక్కో జట్టు ఒక్కో మ్యాచ్ గెలిచాయి. దీంతో 1-1గా సిరీస్ బ్యాలెన్స్ అయింది.