సచిన్ జీవితంలో స్పెషల్ డే…!

-

క్రికెట్ దిగ్గజం, టీం ఇండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ జీవితంలో ఇది ప్రత్యేకమైన రోజు. ఎలా అంటే… అతని కెరీర్ లో మొదటి వన్డే సెంచరీ చేసింది ఈ రోజునే. 1994 సెప్టెంబర్ 9 న ఆస్ట్రేలియా పై అతను ఈ శతకం సాధించాడు. కొలంబో వేదికగా జరిగిన్ డే అండ్ నైట్ మూడో వన్డేలో సచిన్ మొదటి సెంచరీ సాధించాడు. ఈ విషయాన్ని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ఆ మ్యాచ్ లో 110 పరుగులు చేసాడు సచిన్. మొత్తం 130 బంతులు ఆడాడు. 186 నిమిషాలు క్రీజ్ లో ఉన్నాడు. 8 ఫోర్లు కొట్టాడు. 2 సిక్సర్లు కూడా బాదాడు. 84.61 స్ట్రైక్ రేట్ తో తన సెంచరీ నమోదు చేసాడు. అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ వంద సెంచరీలు చేసాడు. టెస్ట్ క్రికెట్ లో 51 శతకాలు బాదాడు. ఇప్పుడు ఆ రికార్డ్ కోహ్లీ ముందు ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news