భారత్, ఇంగ్లండ్‌ల మధ్య చెన్నైలో రెండో టెస్టు శనివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే మొదటి టెస్టు మ్యాచ్ కు ప్రేక్షకులను అనుమతించలేదు. కానీ రెండో టెస్టుకు ప్రేక్షకులను అనుమతించారు. దీంతో రెండో టెస్టు సందర్భంగా గ్యాలరీలో ప్రేక్షకుల సందడి కనిపించింది. అయితే టెస్ట్ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడంతో బీసీసీఐ ఓ ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేసింది.
కరోనా వల్ల దాదాపుగా ఏడాది కాలంగా స్టేడియాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే స్టేడియంలు ఖాళీగా ఉన్న దృశ్యాలను బీసీసీఐ వీడియో రూపంలో తీసి ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో ఆ వీడియో వైరల్‌గా మారింది. దాదాపుగా ఏడాది తరువాత భారత్‌లో మళ్లీ క్రికెట్ మ్యాచ్ లు ప్రారంభం కావడం, అదే సమయానికి ప్రేక్షకులను కూడా అనుమతిస్తుండడం శుభ పరిణామమని బీసీసీఐ తెలిపింది.
Dear #TeamIndia fans we've missed you and we are now all set to welcome back crowds to cricket for the second Test.
Can't wait to have you roaring at The Chepauk tomorrow 💙💙@Paytm #INDvENG pic.twitter.com/7q4S1hPXrB
— BCCI (@BCCI) February 12, 2021
ఇక కరోనా వల్ల గతేడాది మార్చి చివరి నుంచి ప్రారంభం కావల్సిన ఐపీఎల్ 13వ సీజన్ ను సెప్టెంబర్ – నవంబర్ నెలల మధ్య నిర్వహించారు. కానీ ఈ సారి ఐపీఎల్‌ను అనుకున్న తేదీకే.. అది కూడా భారత్‌లోనే నిర్వహిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇక ఈ సారి సీజన్‌కు ఈ నెల 18వ తేదీన ప్లేయర్లకు వేలం పాట నిర్వహించనున్నారు.