ల‌వ‌ర్ ను రివీల్ చేసిన టీమిండియా ఆట‌గాడు

-

సాధార‌ణంగా టీమిండియా ఆట‌గాళ్లంద‌రికీ గ‌ళ్ ఫ్రెండ్స్ ఉంటారు. అయితే ఈ విష‌యాన్ని వారు అంత త్వ‌రగ బ‌య‌ట చెప్ప‌రు. దీంతో టీమిండియా ఆట‌గాళ్ల పై చాలా వ‌ర‌కు గాసిప్స్ వ‌స్తు ఉంటాయి. ఆ స్టార్ ఆట‌గాడు ప‌ల‌నా హీరోయిన్ తో ప్రేమ లో ఉన్నాడ‌ని అంటూ గాసిప్స్ వ‌స్తాయి. ఆ గాసిప్స్ ల‌ను తట్టు కోలేక చివ‌రికి త‌మ కాబోయే శ్రీ‌మ‌తి గురించి వెల్ల‌డిస్తారు.

ఇలాగే టీమిండియా స్టార్ బ్యాట‌ర్ కెఎల్ రా హుల్ విష‌యంలో జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ప్రేమిస్తున్న అమ్మాయి గురించి ఎక్క‌డా చెప్ప‌లేదు. దీంతో కెఎల్ రాహుల్ ప్రేమిస్తున్న అమ్మాయి ఆమెనే అంటు ఇప్ప‌టి వ‌ర‌కు చాలా గాసిప్స్ వ‌చ్చాయి. తాజా గా గాసిప్స్ అన్నింటికీ చెక్ పెడుతూ తాను ప్రేమిస్తున్న అమ్మాయి వివ‌రాల‌ను సోష‌ల్ మీడియా వేదిక గా వెల్ల‌డించారు. ఆమె ఎవ‌రో కాదు బాలీవుడ్ న‌టి అతియా శెట్టి. అమె పుట్టిన రోజు సంద‌ర్భంగా హ్యాపీ బ‌ర్త్ డే మై ల‌వ్ అంటూ త‌న సోషల్ మీడియా ద్వారా వారు క‌లిసి ఉన్న ఫోటో ను షేర్ చేశాడు.

 

అయితే ఇప్ప‌టికే వీరి ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమాయ‌ణం న‌డుస్తుంద‌ని చాలా గాసిప్స్ వ‌చ్చాయి. అలాగే అతియా శెట్టి, కెఎల్ రాహుల్ ఈ మ‌ధ్య కాలంలో లండ‌న్ న‌గ‌రంలో తిరిగిన ఫోటోలు కూడా బాగా వైర‌ల్ అయ్యాయి. కాగ బీసీసీఐ కి ఇచ్చిన పత్రాల‌లో కూడా కెఎల్ రాహుల్ భాగ‌స్వామి లిస్ట్ లో అతియా శెట్టి పేరు ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news