జై భీమ్ లో చూపించినట్లే పోలీసులు నన్ను హిసించారంటున్న ఎంపీ రఘురామ…

నరసాపురం ఎంపీ రఘురామక్రిష్ణం రాజు రూటే సపరేటు.. వైఎస్సార్సీపీ ఎంపీ అయినా.. ప్రభుత్వంపై, సీఎం జగన్ పై విమర్శలు చేయడం ఆయన స్టైల్. స్వపక్షంలో విపక్షంగా రఘురామ వ్యవహరిస్తుంటూారు. గతంలో ఏపీ సీఎం జగన్ పై వివాాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. గతంలో ఇలాంటి ఆరోపణలపైనే ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో హించినట్లు తర్వాత గాయాలను చూపించారు. గతంలో ఈ ఘటన ఏపీలో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పలువురు ఎంపీలు రఘురామక్రిష్ణం రాజుకు మద్దతు తెలిపారు. దీంతో ఏపీ ప్రభుత్వ డిఫెన్స్ లో పడింది.

తాజాగా మరోమారు రఘురామ క్రిష్ణం రాజు మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. జై భీమ్ సినిమాలో చూపించినట్లే నన్ను కూడా పోలీసులు హింసించారంటున్నారు నరసాపురం వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కస్టడీలో తనను హింసించడం పట్ల దర్యాప్తు కోరినా.. ఇప్పటి వరకు దిక్కు లేదని రఘురామ అంటున్నారు. ఎంపీకే దిక్కు లేదంటే లోపం ఎక్కడుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు తగ్గించాలని.. పెట్రోల్ ధరలు తగ్గించి జగన్ మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు రఘురామ.