ఇంగ్లాండ్ వేదికగా విటాలిటీ బ్లాస్ట్ టీ 20 టోర్నమెంట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా గత రాత్రి సర్రే మరియు మిడిల్ సెక్స్ లు తలపడిన మ్యాచ్ లో ఇరు జట్లు కూడా పరుగులు వరదను పారించాయి. మొదట టాస్ గెలిచిన మిడిల్ సెక్స్ బౌలింగ్ ఎంచుకుంది, అనంతరం బ్యాటింగ్ కు దిగిన సర్రే నిర్ణీత ఓవర్ లలో వికెట్లను కోల్పోయి 252 పరుగులు చేసింది. సర్రే టీం లో జాక్స్ 96 మరియు ఇవాన్స్ 85 లు జట్టుకు ఈ స్కోర్ ను అందించారు. ఈ భారీ స్కోర్ ను ఛేదించడం చాలా కష్టం.. కానీ మిడిల్ సెక్స్ ఎంతో నమ్మకంతో మొదటి నుండి ఎక్కడా పట్టు వదలకుండా మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి సర్రే జట్టుకు భారీ షాక్ ఇచ్చింది.
ఈ ఛేదనలో కెప్టెన్ స్టీవెన్ 73, హోల్డెన్ 68 , ర్యాన్ హిగ్గిన్స్ 48 మరియు క్రాక్ నెల్ 36 కీలక పాత్రలు పోషించారు. దీనితో ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి మొత్తం 506 పరుగులు వచ్చాయి.