అహ్మ‌దాబాద్ టెస్టు.. బెన్ స్టోక్స్‌, మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్‌ల మ‌ధ్య వాగ్వాదం.. వీడియో..

-

ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో భార‌త్ 2-1 ఆధిక్యంలో కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే చివ‌రిదైన నాలుగో టెస్టు అహ్మ‌దాబాద్‌లో గురువారం ప్రారంభ‌మైంది. ఈ క్ర‌మంలోనే ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలి రోజు మొద‌టి సెష‌న్ లో ఇంగ్లండ్ త‌డ‌బ‌డింది. 30 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. దీంతో ఇంగ్లండ్ ఆల్ రౌండ‌ర్ స్టోక్స్‌తోపాటు పోప్‌లు ప్ర‌స్తుతం ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే ప‌నిలో ప‌డ్డారు.

war of words between ben stokes and siraj

అయితే మ్యాచ్‌లో 2 కీల‌క వికెట్లు తీసిన సిరాజ్ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో తిప్ప‌లు పెడుతున్నాడు. అది చూసిన బెన్ స్టోక్స్ సిరాజ్‌పై కామెంట్లు చేశాడు. దీంతో సిరాజ్ కూడా స్పందించాడు. ఇక కెప్టెన్ కోహ్లి కూల్ గానే క‌నిపించాడు. అయితే అంపైర్లు క‌ల‌గ‌జేసుకుని ఇద్ద‌రు క్రికెట‌ర్ల‌కు స‌ర్ది చెప్పారు. దీంతో వాగ్వాదం స‌ద్దు మ‌ణిగింది. ఈ క్ర‌మంలోనే స్టోక్స్‌, సిరాజ్ లు మైదానంలో వాగ్వాదం పెట్టుకున్న వీడియో వైర‌ల్‌గా మారింది.

కాగా ప్ర‌స్తుతం ఇంగ్లండ్ 4 వికెట్ల న‌ష్టానికి 107 ప‌రుగుల స్కోరు వ‌ద్ద కొన‌సాగుతోంది. స్టోక్స్ (46), ఆల్లీ పోప్ (9)లు క్రీజులో ఉన్నారు. సిరాజ్‌, అక్ష‌ర్ ప‌టేల్‌ల‌కు చెరో 2 వికెట్లు ద‌క్కాయి. అంతకు ముందు ఇదే మైదానంలో పింక్ బంతితో జ‌రిగిన టెస్టు మ్యాచ్ లో రాణించిన విధంగానే భార‌త బౌల‌ర్లు మ‌ళ్లీ ఆక‌ట్టుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఇంగ్లండ్‌కు మ‌ళ్లీ క‌ష్టాలు త‌ప్పేలా లేవ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news