ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం.. వారి నివాసానికి సొరంగ మార్గం..!

-

దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణంలో అనేక కొత్త విష‌యాలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ భ‌వ‌నాన్ని అన్ని హంగులు, అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు గురించిన అనేక ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. ఈ కొత్త పార్లమెంట్ భవనానికి 2020 డిసెంబర్ 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం నాలుగు అంతస్తుల్లో కొత్త పార్లమెంట్‌ భవనం నిర్మాణం కానున్నట్లు సమాచారం. దీనికోసం కేంద్ర ప్రభుత్వం రూ.971 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా కూడా వేసింది. మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త పార్లమెంట్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు.

కొత్త పార్లమెంట్ భవనం
కొత్త పార్లమెంట్ భవనం

అయితే, ఈ కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంపై రోజూ ఆసక్తిక విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, దేశ ప్రధాని నివాస భవనం, ఉప రాష్ట్రపతి నివాస భవనం, ఎంపీల చాంబర్స్‌కు వెళ్లేలా సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. వీఐపీలు వెళ్లిన సమయంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతోందని, అధిక సెక్యూరిటీ కలిగిన ప్రధాని, ఉపరాష్ట్రపతి వంటి వారు సాధారణ ట్రాఫిక్ నుంచి వేరే చేయాలనే ఆలోచనతో ఈ తీసుకున్నట్లు ప్రాజెక్ట్ రూపకర్త బిమల్ పటేల్ వెల్లడించారు. ఈ మేరకు సెంట్రల్ విస్టా ప్రతిపాదనను తీసుకొచ్చారు.

ఈ తరుణంలో ప్రధాని నివాసం నుంచి పార్లమెంట్‌కు నేరుగా ఓ టన్నెల్ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ సంస్థల బిల్డింగ్స్, ప్రభుత్వ భవనాలను మార్చడానికి.. వీటికి కొత్త రూపు కల్పించడానికి సెంట్రల్ విస్టా సరికొత్త ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే ప్రధాన మంత్రి నివాసం నుంచి పార్లమెంట్ వరకు సొరంగం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అయితే ప్రత్యేక టన్నెల్ ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య తీరుతుందని బిమల్ పటేల్ తెలిపారు. సొరంగ నిర్మాణంతో వీవీఐపీలకు భద్రత కల్పించాలని సులువు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న రక్షణ సిబ్బంది కార్యాలయాలు తొలగించబడుతాయని, ఇక్కడ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news