సంక్షోభం దెబ్బకు ఛాయ్‌ అమ్ముకుంటున్న శ్రీలంక క్రికెటర్‌ !

మన పక్క దేశం అయిన శ్రీలంకలో అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. ఆర్థిక సంక్షోభంతో.. శ్రీలంక ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. శ్రీలంకలో దారుణంగా పరిస్థితి మారింది. పెట్రోలు బంకుల వద్ద అయితే.. లంకా వాసులు ఘర్షణకు దిగుతున్నారు. శ్రీలంకకు అన్ని విధాలా ఇండియా అండగా ఉంటూ.. ఆర్థిక సాయం చేస్తోంది.

అయితే.. శ్రీలంక మాజీ క్రికెటర్‌, మాజీ కోచ్‌ అయిన రోషన్‌ మహానామా అక్కడి ప్రజలకు తన వంతు సాయం అందిస్తున్నాడు. పెట్రోల్‌ బంకుల వద్ద క్యూలైన్‌ లో ఉన్న ప్రజలకు టీ, బన్నులు అందించి మానవత్వం చాటు కున్నాడు. అయితే.. వీటి కోసం రోజు రోజుకు క్యూలైన్లు పెరిగిపోతున్నాయని.. అది తనను మరింత బాధ పెట్టిందని.. రోషన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.. ప్రజలు గంటల తరబడి క్యూలైన్‌ లో నిల్చోవడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని ట్వీట్‌ చేశారు. కాగా.. 1996 లో ప్రపంచ కప్‌ సాధించిన జట్టు లో రోషన్‌ కూడా ఉన్నారు.