ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు.. రిటైర్‌మెంట్‌పై చెన్నై ఫ్రాంచైజీ

-

ఐపీఎల్ 2024 సీజన్‌లో కీలక మ్యాచ్‌లో సీఎస్కేపై బెంగళూరు విజయం సాధించడంతో టోర్నీ నుంచి చెన్నై నిష్క్రమించక తప్పలేదు. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ దూకుడుగా ఆడి జట్టును గెలిపించే ప్రయత్నం చేసినా కుదరలేదు. ఈ సీజన్‌ తర్వాత మాహీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని అంతా భావిస్తున్నా.. ధోనీ మాత్రం ఇంకా స్పందించలేదు. ఇదే విషయాన్ని చెన్నై క్రికెట్ వర్గాలు మరోసారి స్పష్టం చేశాయి.

‘‘ధోనీ ఇప్పటి వరకు తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాతో మాట్లాడలేదు. తాను వీడ్కోలు పలుకుతానని ఎప్పుడూ చెప్పలేదు. మేనేజ్‌మెంట్‌తో తన నిర్ణయం వెల్లడించేందుకు కాస్త సమయం తీసుకుంటాడని అనుకుంటున్నాం. ప్రస్తుత సీజన్‌లో అతడు వికెట్ల మధ్య పరుగెత్తడంలో ఎక్కడా ఇబ్బంది పడినట్లు అనిపించలేదు. వచ్చే సీజన్‌లో ఇంపాక్ట్‌ రూల్‌ను ఉపయోగించుకుని ధోనీని కేవలం బ్యాటింగ్‌కే దిగేలా చూడాలని అభిమానులు కోరుతున్నారు. కానీ, ‘కెప్టెన్ కూల్’ ఎలాంటి డెసిషన్‌ తీసుకుంటాడో తెలియదు. ఈ సీజన్‌ ఇప్పుడే ముగిసింది. అతడితో మాట్లాడేందుకు సరైన సమయం కోసం వేచి చూస్తున్నాం. జట్టు ప్రయోజనాల కోసమే ఎప్పుడూ ఆలోచించే వ్యక్తి ధోనీ. కాబట్టి, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు ఇబ్బంది లేదు’’ అని సీఎస్కే వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news