సీనియర్ ప్లేయర్స్ పూజార, రహానే టెస్ట్ జట్టు లో ఉండడంతో మొన్నటి దాకా శ్రేయస్ అయ్యర్ కి టీమ్ ఇండియా లో ఆడే అవకాశాలు పెద్దగా రాలేదు ఒకవేళ వచ్చినా కూడా ఒకటి రెండు మ్యాచ్లకి మాత్రమే పరిమితమయ్యాడు. సీనియర్ ప్లేయర్లు ఫామ్ కోల్పోయాక గిల్, శ్రేయాస్ అయ్యర్ లకి సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు మిడిల్ ఆర్డర్ లో జట్టుని ఆదుకోవడానికి ఈ అవకాశాన్ని ఇచ్చారు. గిల్ సెంచరీ చేశాడు కానీ శ్రేయస్ మాత్రం సాధారణంగానే ఆడాడు ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ తో చివరి మూడు టెస్టులకి అతని సెలెక్ట్ చేయడం కష్టమేనని మాజీ క్రికెటర్లు అంటున్నారు.
ఫామ్ ఎంత కీలకమో శ్రేయస్ అర్థం చేసుకోవాలి జట్టుతో పాటు అతనికి ఫాం చాలా ముఖ్యం ఇప్పటికే చాలాసార్లు అవకాశాలు వచ్చాయి ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడలేదు ఒక్క పేసర్ మాత్రమే ఇంగ్లాండ్ జట్టులో ఉండగా మిగిలిన వారందరూ స్పిన్నర్లే కాస్త కుదురుకుని పరుగులు చేస్తే బాగుంటుందని జహీర్ ఖాన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.