కేఎల్ రాహుల్ కు గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్

-

టీమిండియా మాజీ బ్యాట్స్మెన్, బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్ ఎప్పుడు.. టీమిండియా క్రికెటర్లపై కామెంట్ చేస్తూనే ఉంటాడు. ఇలా కామెంట్ చేస్తూ వివాదానికి తెరలేపారు ఉంటాడు. అయితే తాజాగా టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కు గౌతమ్ గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. లక్నో సూపర్ జెంట్స్ కు రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అదే జట్టుకు గౌతం గంభీర్ కూడా మెంటర్ గా ఉన్నాడు.

ఈ నేపథ్యంలోనే రాహుల్కు హెచ్చరికలు పంపాడు. ఐపీఎల్ జట్టు కెప్టెన్గా ఉన్నంత మాత్రాన… టీమిండియా కెప్టెన్సీ కి గ్యారెంటీ ఉండదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చురకలు అంటించాడు. ఎల్ ఎస్ జికి కావాల్సింది జట్టును నడిపించే బ్యాటర్ కానీ… బ్యాటింగ్ చేసే కెప్టెన్ కాదని అన్నాడు గంభీర్.

ఈ రెండిటి మధ్య తేడాను రాహుల్ అర్థం చేసుకుంటాడని తాను భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. జట్టుకు అధినేత కెప్టెనే అని … ఎల్ జి సి కి మైదానం లోపల మరియు వెలుపల రాహుల్ బాధ్యత అని చెప్పాడు. మైదానంలో నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలని దానికోసం మొదటి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని గంభీర్ చెప్పుకొచ్చాడు. కెప్టెన్ అనే వాడు కచ్చితంగా రిస్కు తీసుకో వాలని, రాహుల్ కు అదే తాను సూచిస్తున్నట్లు గంభీర్ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news