టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై మరో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ విమర్శలు చేసాడు. 217 పరుగుల లక్ష్యం ఉన్నా సరే ధోనీ ఆలస్యంగా రావడంపై గంభీర్ అసహనం వ్యక్తం చేసాడు. 217 పరుగుల టార్గెట్ ఉన్నా ధోనీ 7 వ స్థానంలో రావడం ఏంటీ అని గంభీర్ ప్రశ్నించాడు. కెప్టెన్ గా జట్టుని ముందు ఉండి నడిపించాలి కదా అని ప్రశ్నించాడు. నీకంటే విజయ్, జాదవ్ బెటర్ అనిపించారు అని అన్నాడు.
కాగా నిన్న జరిగిన మ్యాచ్ లో చెన్నై 16 పరుగుల తేడాతో రాజస్థాన్ పై ఓడిపోయిన సంగతి తెలిసిందే. భారీ లక్ష్యం ముందు ఉండటం వరుసగా వికెట్లు కోల్పోవడంతో చెన్నై లక్ష్యాన్ని సాధించలేకపోయింది. చెన్నై జట్టులో దుప్లేసిస్ మినహా మరో ఆటగాడు ఎవరూ ఆకట్టుకోలేదు. నేడు ముంబై, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.