ఫిడే క్యాండిడేట్స్‌ విజేతగా చరిత్ర సృష్టించిన గ్రాండ్‌మాస్టర్‌ గుకేశ్‌

-

భారత గ్రాండ్ మాస్టర్ గుకేశ్ హిస్టరీ క్రియేట్ చేశాడు. తాజాగా నడా వేదికగా జరిగిన ఫిడే క్యాండిడేట్స్ 2024 టోర్నమెంట్లో 17 ఏళ్ల గుకేశ్ తన ప్రత్యర్థి హికారు నకముర (అమెరికన్)పై విజయం సాధించాడు. అతి పిన్న వయసులో ఫిడే క్యాంటిడేట్స్ సొంతం చేసుకున్న ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్యాండిడేట్స్ విజేతగా నిలిచిన రెండో భారతీయుడిగానూ గుకేశ్ రికార్డు సాధించాడు.

13వ రౌండ్‌ నాటికి మొత్తం 8.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో నిలిచిన గుకేశ్.. అమెరికాకు చెందిన హికరు నకమురతో జరిగిన 14వ రౌండ్‌ను డ్రా చేసుకోవడంతో అతడి ఖాతాలో 9 పాయింట్లు చేరాయి. మరోవైపు నెపోమ్నియాషి (రష్యా) – ఫాబియానో కరువానా (అమెరికా) మధ్య మ్యాచ్‌ కూడా డ్రా అయింది.  వారిద్దరూ 8.5 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. దీంతో భారత యువ చెస్‌ ప్లేయర్ గుకేశ్‌ టైటిల్‌ను సాధించాడు.

అత్యంత పిన్న వయస్కుడిగా క్యాండిడేట్స్‌ టోర్నీ టైటిల్‌ గెలిచిన గుకేశ్‌కు మరో చెస్ లెజెండ్ విశ్వనాథన్ శుభాకాంక్షలు తెలిపారు. చెస్‌ కుటుంబమంతా తన ఘనతకు గర్వపడుతోందని కొనియాడారు. “నువ్వు ఆడిన తీరు నన్ను వ్యక్తిగతంగా ఆకట్టుకుంది. క్లిష్టపరిస్థితులను ఎదుర్కొని విజేతగా నిలవడం అభినందనీయం’’ అని విశ్వనాథన్ ఆనంద్‌ పోస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news