తిలక్ వల్ల ఓడిపోయామని హార్దిక్ కామెంట్స్ పై ఫ్యాన్స్ సీరియస్..!

-

ముంబై ఇండియన్స్ ప్లేయర్ తిలక్ వర్మ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా తన సత్తా ని చాటుతున్నాడు. నిన్న ఢిల్లీలో మ్యాచ్లో విరోచితంగా పోరాడాడు అయితే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 258 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 10 పరుగులు తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ 32 బంతుల్లో 63 రన్స్ని స్కోర్ చేశాడు చివరిదాకా క్రీజ్ లో ఉన్నప్పటికీ ముంబై ఇండియన్స్ విజయాన్ని అందుకోలేక పోయింది. అక్షర్ వేసిన ఎనిమిదవ ఓవర్లో వర్మ నాలుగు సింగిల్స్ మాత్రమే తీయగలిగాడు.

లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ చేస్తున్నప్పుడు తిలక్ షార్ట్స్ ఆడకుండా సింగిల్ తీయడంతో ముంబై ఓడిపోయిందని హార్దిక్ పాండ్యా తిలక్ మీద కామెంట్స్ చేశారు. అతనికి ఆటపట్ల అవగాహన లేకపోవడం వలన ఇలా జరిగిందని అన్నారు హార్దిక్. ఇది చూసి పాండ్య మీద ఫాన్స్ విరుచుకుపడుతున్నారు. మరి నువ్వేం పొడిచావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు మంచిగా ఆడుతున్న యువ క్రికెటర్ ని నిందించడం మంచిది కాదంటూ మండిపడుతున్నారు

Read more RELATED
Recommended to you

Latest news