ఈ కప్ నా కొడుకు కోసమే: పాండ్యా

ముంబై ఇండియన్స్ జట్టులో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. లీగ్ దశ నుంచి కూడా పాండ్యా జట్టులో తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో 178.98 స్ట్రైక్ రేట్‌ తో పాండ్యా 14 మ్యాచ్‌ ల్లో 281 పరుగులు చేశాడు. మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తమ 5 వ ఐపిఎల్ టైటిల్‌ ను కైవసం చేసుకుంది. అయితే ఈ విజయాన్ని పాండ్యా తన 3 నెలల కుమారుడు అగస్త్యకు అంకితం చేసాడు.

“ఇది నీ కోసం, అగస్యా,” అంటూ పాండ్యా ట్రోఫీని పట్టుకున్న ఫోటోతో ట్వీట్ చేసాడు. లవ్ థిస్ టీం అంటూ పేర్కొన్నాడు. ఈ ఏడాది జూలై 30 న హార్దిక్ పాండ్యా మరియు అతని భాగస్వామి నటాసా స్టాంకోవిక్ కు జన్మించిన సంగతి తెలిసిందే. అయితే వీరు పెళ్లి చేసుకోకుండానే కొడుకుని కన్నారు. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థ ప్రకటన చేసారు.