టీమిండియాకు మరో పరాభవం ఎదురైంది. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఓటమి చవిచూసింది. బంగ్లాదేశ్ చేతిలో ఒక వికెట్ తేడాతో ఓటమిపాలైంది. టీమిండియా 136 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచిన బంగ్లాదేశ్ ను భారత ఫీల్డర్లు తమకు మాత్రమే సాధ్యమైనా చెత్త ప్రదర్శనతో గెలిపించారు.
అయితే, బంగ్లాదేశ్ తో తొలి వన్డేలో ఓటమితో బాధలో ఉన్న టీమ్ ఇండియాకు ఐసిసి గట్టి షాక్ ఇచ్చింది. బంగ్లా తో తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియా మ్యాచ్ ఫీజులో 80% కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా షెడ్యూల్ సమయానికి ఓవర్లు పూర్తి చేయలేకపోతే 20% మ్యాచ్ ఫీజుని పెనాల్టీని విధిస్తారు. అయితే తొలి వన్డేలో టీమిండియా, ఓవర్ రేటుకి ఏకంగా నాలుగు ఓవర్లు తక్కువగా చేసింది వేసింది. దీంతో తక్కువ వేసిన ఒక్కో ఓవర్ కి 20 శాతం చొప్పున 80% మ్యాచ్ ఫీజును కోత విధిస్తున్నట్లు ఐసిసి పేర్కొంది.