Paris Olympics 2024 : ‘నా బిడ్డ అమ్మాయే’.. ఇమానె ఖెలిఫ్‌ తండ్రి క్లారిటీ

-

పారిస్ ఒలింపిక్స్‌లో అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్‌ అత్యంత వివాదాస్పదంగా నిలిచిన విషయం తెలిసిందే. పురుష లక్షణాలున్న ఖెలిఫ్‌ను మహిళల విభాగంలో ఎలా ఆడనిస్తారంటూ నెట్టింట విపరీతంగా విమర్శలు వచ్చాయి. దీంతో ‘ఆమె’ అతడా? అనే అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె జెండర్పై కొద్దిరోజులుగా చర్చ నడుస్తోంది.

ఇదే కారణంతో గతేడాది ఖెలిఫ్‌పై అంతర్జాతీయ బాక్సింగ్‌ అసోసియేషన్‌ అనర్హత వేటు వేసింది. కానీ, ఒలింపిక్‌ కమిటీ నిబంధనలు మరోలా ఉండటంతో ఆమె పోటీలో పాల్గొని సెమీస్‌కు చేరుకొని మెడల్‌ను ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో ఆమెపై వస్తున్న విమర్శలపై ఖెలిఫ్‌ తండ్రి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు.

తన బిడ్డ ఖెలిఫ్ అమ్మాయేనని.. అడపిల్లగానే పుట్టిందని.. అమ్మాయిలాగే పెరిగిందని స్పష్టం చేశారు. అయితే దృఢంగా ఉండటం, ధైర్యంగా నడుచుకోవడం, కష్టపడటం తన బిడ్డకు తానే నేర్పానని.. అందుకోసం ఆమె ఎంతో శ్రమించిందని చెప్పుకొచ్చారు. ఇటాలియన్ బాక్సర్ కంటే తన కుమార్తె చాలా బలంగా ఉండటం వల్లే బౌట్ను సులువుగా గెలుచుకోగలిగిందని.. ఇమానె తండ్రి ఒమర్ ఖెలిఫ్ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news