విశ్వం ఉన్నంతవరకు ఎర్రజెండా ఉంటుంది – ఎమ్మెల్యే కూనంనేని

-

విశ్వం ఉన్నంతవరకు ఎర్రజెండా ఉంటుందన్నారు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. మంగళవారం సిపిఐ 99వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సభలో కూనంనేని మాట్లాడుతూ.. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించిన తరువాతే అనేక చట్టాలు, అనేక సంక్షేమ పథకాలు పుట్టుకొచ్చాయన్నారు. దేశంలో ఔట్ సోర్సింగ్ పేరుతో కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు.

కోట్లాది మంది పేదరికంతో దుర్బర జీవితాన్ని అనుభవిస్తున్నారని చెప్పుకొచ్చారు కూనంనేని. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఎర్రజెండా పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే గెలిచామన్నారు. రోజుకొక పార్టీ మారే హీనులు కమ్యూనిస్టుల పార్టీలపై అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉంటుంది, పోతుంది.. కానీ విశ్వం ఉన్నంత వరకు ఎర్ర జెండా ఉంటుందన్నారు. ప్రస్తుతం 99 ఏళ్ళలోకి అడుగు పెట్టామని.. ఏడాది పాటు కమ్యూనిస్ట్ ఉత్సవాలు జరుకుంటామని చెప్పుకొచ్చారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వ కార్డు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా గుర్తింపు ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news