భారత్‌ ఆలౌట్‌.. ఇంగ్లండ్‌ ఎదుట భారీ లక్ష్యం

-

విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా టీమిండియా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 78.3 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌట్‌ అయింది. తద్వారా భారత్‌కు 398 పరుగుల ఆధిక్యం దక్కింది. మూడో సెషన్‌లో భారత్‌ వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. కానీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (61 బంతుల్లో 29, 2 ఫోర్లు, 1 సిక్సర్‌) ఒంటరిపోరాటం చేసి భారత ఆధిక్యాన్ని 400 పరుగులకు అత్యంత చేరువగా తీసుకొచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యాన్ని కలుపుకుని భారత్‌.. ఇంగ్లండ్‌ ముందు 399 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

సొంతగడ్డపై టెస్టు ఆడుతున్న వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ (6) మరోసారి విఫలమవగా కుల్‌దీప్‌ యాదవ్‌ డకౌట్‌ అయ్యాడు. బుమ్రా వికెట్లకు అడ్డంగా నిలబడ్డాడు. 26 బంతులాడిన బుమ్రా పరుగులేమీ చేయనప్పటికీ అశ్విన్‌తో కలిసి 9 వికెట్‌కు 26 పరుగులు జోడించారు. అశ్విన్‌ తర్వాత వచ్చిన ముగ్గురు లోయరార్డర్‌ బ్యాటర్లు (కుల్‌దీప్‌, బుమ్రా, ముకేశ్‌ కుమార్‌)లు సున్నా పరుగులే వద్దే ఉండటం భారత్‌ను దెబ్బతీసింది. కుల్‌దీప్‌, బుమ్రాలు హర్ట్లీకి చిక్కగా అశ్విన్‌, భరత్‌లను అహ్మద్‌ ఔట్‌ చేశాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో టామ్‌ హర్ట్లీ నాలుగు వికెట్లు తీయగా రిహాన్‌ అహ్మద్‌ మూడు వికెట్లు పడగొట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news