Road Safety World Series : బిన్నీ ఊచకోత..సౌతాఫ్రికాపై ఇండియా లెజెండ్స్‌ విక్టరీ

-

Road Safety World Series : రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో ఇండియా లెజెండ్స్ శుభారంభం చేసింది. సౌత్ ఆఫ్రికా లెజెండ్స్ పై ఘన విజయం సాధించింది. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో భారత రోడ్డు రవాణా, హైవేలు మరియు ఐటీ మంత్రిత్వ శాఖ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్-2022 సీజన్ ను నిర్వహిస్తోంది.

ఇప్పటికే ఓ సీజన్ ఘనంగా ముగించుకున్న ఈ టోర్నీ మళ్లీ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్ రెండో సీజన్ లో ఇండియన్ లెజెండ్స్ జట్టుకు సచిన్ టెండూల్కర్ సారధిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ లెజెండ్స్ తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ దిగ్గజ జట్లు బరిలోకి దిగాయి.

ఈ సీజన్ తొలి మ్యాచ్ ఖాన్ పూర్ వేదికగా జరిగింది. ఇండియా లెజెండ్స్, సౌత్ ఆఫ్రికా లెజెండ్స్ తలపడ్డాయి. ఇక ఇండియా లెజెండ్స్ ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ (82 పరుగులు 42 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్లు నాటౌట్) చెలరేగి ఆడాడు. దీంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 217 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం చేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా లెజెండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇండియా 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news