ఇండియా ఓపెన్ : సైనాకు షాక్.. క్వార్ట‌ర్స్ కు సింధు

ఢిల్లీ వేదిక‌గా ఇండియా ఓపెన్ మెగా టోర్నీ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ టోర్నీ లో స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు దూసుకుపోతుంది. వ‌రుస‌గా గెలుపుల‌తో టైటిల్ గురి పెడుతుంది. తాజా గా గురువారం రెండో రౌండ్లులో కూడా విజ‌యం సాధించింది. దీంతో పీవీ సింధు ఘ‌నంగా క్వార్ట‌ర్స్ లోకి అడుగు పెట్టింది. ఇండియా ఓపెన్ లోని రెండో రౌండ్ లో 21 – 10, 21- 10 తేడాతో ఐరా శ‌ర్మ‌ను సులువుగా ఓడించింది. అలాగే మ‌రో స్టార్్ ష‌ట్ల‌ర్ సైనా నెహ్వాల్ కు మాత్రం షాక్ త‌గిలింది.

ఇండియా ఓపెన్ రెండో రౌండ్ లో దారుణంగా ఓట‌మి పాలు అయింది. ప్ర‌పంచ 111 వ ర్యాంక్ మాళ‌విక బ‌న్సోద్ చేతిలో సైనా ఓట‌మి పాలైంది. 17 – 21, 9 – 21 తేడాతో దారుణ ఓట‌మిని చవి చూసింది. దీంతో సైనా నెహ్వాల్ ఇండియా ఓపెన్ నుంచి నిష్క‌మించింది. కాగ ఇండియా ఓపెన్ లో క‌రోనా క‌ల‌కలం రేపిన విష‌యం తెలిసింది. క‌రోనా కార‌ణంగా ఇండియా స్టార్ ష‌ట్ల‌ర్లు ఈ టోర్నీకి దూరం అయ్యారు. కిదాంబి శ్రీ‌కాంత్, అశ్విన్ పొన్న‌ప్ప‌తో స‌హా మొత్తం ఏడుగురు ఇండియా ఆట‌గాళ్లు క‌రోనా బారిన ప‌డ్డారు.