అక్కినేని నాగేశ్వరరావు అనే పెద్ద పేరు దగ్గర,కీర్తి దగ్గర మరికొన్ని ఉంటాయి.పేరూ,కీర్తీ అన్నవి చాలా గొప్పవి. వాటితో పాటు స్మరణ కూడా! నాన్న జ్ఞాపకాల్లో నాగార్జున ఉన్నారు. రానున్న కాలంలోనూ ఇలాంటి కథలు వస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో ఉన్నారు.అందుకు తగ్గ వాతావరణం మన దగ్గర పుష్కలంగా ఉంది అంటూ మరోసారి భరోసా ఇస్తూ బంగార్రాజు విషయమై కాన్ఫిడెంట్ సైన్ ఇస్తున్నారు.
సంక్రాంతికి బంగార్రాజు వచ్చేస్తున్నాడు..అనుకున్న సమయానికే అనుకున్న విధంగా వచ్చేస్తున్నాడు.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అన్ని పనులూ పూర్తయ్యాయి.ప్రీ రిలీజ్ వేడుక కూడా వైభవోపేతంగా నిర్వహించి నాగ్, చై తమ అభిమానులను మరొక్కసారి అలరించారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి, అనుకున్న సమయానికి విడుదల కావడానికి సాంకేతిక నిపుణులు కారణమని, వారెంతో శ్రమించి పనిచేసి మంచి ఫలితం తీసుకువచ్చారని అన్నారు నాగ్. ఇక ఈ సినిమాపై మొదట్నుంచి మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్న నాగార్జున అదే టెంపో ప్రతిసారీ మీడియా ఎదుట మాట్లాడుతూ, పాజిటివ్ సైన్ ఇస్తున్నారు.నేను ఈ సినిమాలో మీసం మెలేశా, నాగ చైతన్య ఈ సినిమా మీసం మెలేశాడు. అదేవిధంగా అభిమానులూ మీసం మెలేశాలా చేస్తాను అంత బాగుంటుంది ఈ సినిమా..ఇది పండగ సినిమా, పండగలాంటి సినిమా అని కూడా చెప్పారు నిన్నటి వేడుకల్లో!
ఇక మీడియా మీట్లలోనూ, వేడుకల్లోనూ నాన్న ఏఎన్నార్ ను స్మరించారు. పంచె కట్టు కడితే తెలియకుండానే పొగరు వచ్చేస్తుంది. ఆ పొగరుతోనే నటించేటప్పుడు తెలియని హుషారు వస్తుంది. నాన్న ప్రభావం ఈ విషయమై నాపై చాలా ఉంది…అంటూ నాటి దసరా బుల్లోడు నుంచి నేటి సోగ్గాడే చిన్ని నాయనా వరకూ తనను పంచెకట్టు ఏ విధంగా ఆకట్టుకున్నది చెప్పారు. ఇదే సమయంలో అక్కినేని నటవారసుడు నాగ చైతన్య ను కూడా పంచె కట్టు బాగా అదిరిపోయింది. నేను కూడా ఊహించలేనంత బాగా పంచెకట్టులో, పల్లెటూరి నేపథ్యంలో ఎంతో బాగా నటించాడు అని కొడుక్కి కితాబులు ఇచ్చారు నాగ్.