వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం.. టీమిండియా ఇంగ్లండ్ వెళ్లింది..!

-

ఈ నెల 30వ తేదీ నుంచి ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదిక‌గా వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్న‌మెంట్ జ‌ర‌గ‌నుండ‌గా, 30వ తేదీన ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అలాగే టీమిండియా త‌న మొద‌టి మ్యాచ్‌ను జూన్ 5వ తేదీన ఆడ‌నుంది.

మ‌రో 8 రోజుల్లో ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఈ నెల 24వ తేదీ నుంచి ప్ర‌పంచ క‌ప్‌లో పాల్గొనే ఆయా దేశాల‌కు చెందిన జ‌ట్ల‌కు వార్మ‌ప్ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. దీంతో ఇప్ప‌టికే జట్ల‌న్నీ వ‌రల్డ్ క‌ప్ ఆతిథ్య దేశం ఇంగ్లండ్‌కు ప్ర‌యాణం అయ్యాయి. ఇక టీమిండియా కూడా ఇంగ్లండ్‌కు బ‌యల్దేరింది. ఈ క్ర‌మంలోనే ఇవాళ ఉద‌యం 4.30 గంట‌ల‌కు ముంబై ఎయిర్‌పోర్టు నుంచి 15 మందితో కూడిన టీమిండియా బృందం ఇంగ్లండ్ విమానం ఎక్కింది.

కాగా గ‌త కొద్ది రోజుల కింద‌ట గాయం బారిన ప‌డిన కేదార్ జాద‌వ్ కూడా మిగితా జ‌ట్టు స‌భ్యుల‌తో చేరి ఇంగ్లండ్‌కు ప్ర‌యాణం అయ్యాడు. టీమిండియా జ‌ట్టుతోపాటు కోచ్‌, ఇత‌ర సహాయ‌క సిబ్బంది కూడా జ‌ట్టుతోనే ఇంగ్లండ్ ప్ర‌యాణం అయ్యారు. ఇక విమానం ఎక్కే ముందు ముంబై ఎయిర్‌పోర్టులో టీమిండియా ఆట‌గాళ్లు కాసేపు స‌ర‌దాగా గ‌డిపారు. ముఖ్యంగా ప్లేయ‌ర్లు ష‌మీ, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, ధోనీలు ప‌బ్‌జి మొబైల్ గేమ్ ఆడుతూ ఉత్సాహంగా కనిపించారు. ఈ క్ర‌మంలోనే వారు ఎయిర్ పోర్టులో ఉన్న‌ప్ప‌టి ఫొటోల‌ను బీసీసీఐ చిత్రీక‌రించి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అలాగే ఇత‌ర ప్లేయ‌ర్లు కూడా తమ త‌మ ట్విట్ట‌ర్ అకౌంట్ల‌లో తాము ఇంగ్లండ్‌కు వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం ప్ర‌యాణ‌మై వెళ్తున్నామ‌ని ట్వీట్లు చేసి, వాటిల్లో ఫొటోలు పెట్టారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ఆ ఫొటోలు నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి.

కాగా ఈ నెల 30వ తేదీ నుంచి ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదిక‌గా వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్న‌మెంట్ జ‌ర‌గ‌నుండ‌గా, 30వ తేదీన ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అలాగే టీమిండియా త‌న మొద‌టి మ్యాచ్‌ను జూన్ 5వ తేదీన ఆడ‌నుంది. అందులో భార‌త్ సౌతాఫ్రికాతో త‌ల‌ప‌డ‌నుంది. ఇక ఈ సారి ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, భార‌త్ లు ఫేవ‌రెట్లుగా వ‌ర‌ల్డ్ క‌ప్ బ‌రిలోకి దిగుతున్నాయి.

టీమిండియా జ‌ట్టు స‌భ్యుల వివ‌రాలు…

విరాట్ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్ శ‌ర్మ (వైస్ కెప్టెన్‌), శిఖర్ ధావ‌న్‌, కేఎల్ రాహుల్‌, విజ‌య్ శంక‌ర్‌, మ‌హేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీప‌ర్‌), కేదార్ జాద‌వ్‌, దినేష్ కార్తీక్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌, కుల్దీప్ యాద‌వ్‌, భువ‌నేశ్వర్ కుమార్‌, జ‌స్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version