టీ-20 ప్రపంచ కప్ కి భారత ఉమెన్స్ జట్టు ప్రకటించిన బీసీసీఐ

-

అక్టోబర్ 3 నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరుగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) తాజాగా టీమిండియా జట్టును ప్రకటించింది. ఈ ప్రపంచ టోర్నీలో టీమిండియాకు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా వ్యవహరించనుంది. ఈ టోర్నీలో అక్టోబర్ 4న న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా ప్రపంచ కప్ లో విజయాల వేట ప్రారంభిస్తుంది. దీని తర్వాత అక్టోబర్ 6న పాకిస్థాన్ జట్టుతో, ఆపై అక్టోబర్ 9న శ్రీలంక జట్టుతో మ్యాచ్ లు ఆడనుంది టీమిండియా.

ఈ రెండు మ్యాచ్ లు దుబాయ్ లోనే జరగనున్నాయి. ఇక టీమిండియాగ్రూప్ స్టేజిలో తన చివరి మ్యాచ్ ను అక్టోబర్ 13న ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ షార్జా వేదికగా జరుగుతుంది. టీమిండియాకు చెందిన ఈ గ్రూప్ మ్యాచ్ లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇవాళ ప్రకటించిన టీమిండియా జట్టు ఇదే :

హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్త, రోడ్రిగ్స్, ఘోష్, భాటియా, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, ఠాకూర్, హేమలత, శోభన, రాధా యాదవ్, పాటిల్, సజీవన్ లు టీంలో ఉన్నారు. ఇక సైమా ఠాకూర్, తనూజా కన్వర్, ఉమా చెత్రిలు ట్రావెలింగ్ రిజర్వ్ లుగా జట్టులో స్థానం కల్పించింది బీసీసీఐ.

Read more RELATED
Recommended to you

Latest news