తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు పై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్ పోర్టులను రద్దు చేశామని.. త్వరలోనే వాళ్లు అరెస్ట్ అవుతారని చెప్పారు. ఇక బీఆర్ఎస్ మైండ్ లో మూసీ పరివాహక ప్రజలపై విషయం ఉందని మడిపడ్డారు. కావాలంటే వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తామని.. దమ్ముంటే ఈ పాదయాత్రకు కేటీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ తనతో పాటు రావాలని సవాల్ విసిరారు.
మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల తరువాత క్యాబినెట్ విస్తరణ చేపడుతామని తెలిపారు. తనకు అధిష్టానంతో గ్యాప్ లేదని వెల్లడించారు. రాష్ట్రంలో ఏఐసీసీ అంటే తానేనని పేర్కొన్నారు. రోజుకు ఎనిమిది గంటలు మూసీపైనే పని చేస్తున్నట్టు తెలిపారు. హైడ్రా వల్లనే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. దేశవ్యాప్తంగా రియల్ రంగంలో స్తబ్దత ఏర్పడిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.