ఐపీఎల్ 2023: ఈరోజు ఓడితే ఇంటికెళ్లే 2వ టీం గా SRH…

-

సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్యన సాధారణమైన గేమ్ జరగనుంది. అయితే పరిస్థితులను బట్టి చూస్తే ఈ మ్యాచ్ లో పెద్దగా హోరాహోరీ ఉండే అవకాశం లేదు. ఇప్పటికే గుజరాత్ ప్లే ఆఫ్ వీకెళ్ళడం ఖాయం అని తెలిసిపోయింది. ఇక ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు దాదాపు లేనట్లే. అద్భుతాలు జరగడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ రోజు మ్యాచ్ లో కనుక హైదరాబాద్ ఓడిపోతే ఇక మరో
2 మ్యాచ్ లు మిగిలి ఉండగానే టోర్నీ నుండి తొలగిపోయినట్లే. ఈ సీజన్ లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ మార్ క్రామ్ కెప్టెన్సీ లో అద్భుతాలు సృష్టిస్తుందని అందరూ నమ్మరు.

కానీ మార్ క్రామ్ కెప్టెన్ గా మరియు ప్లేయర్ గా రెండింటిలోనూ ఫెయిల్ అయ్యి SRH వైఫల్యానికి ప్రధాన కారణం అయ్యాడు. ఇప్పుడు ఢిల్లీ ఆల్రెడీ ప్లే ఆఫ్ నుండి నిష్క్రమించడంతో ఈ రోజు SRH ఓడిపోతే ఇంటికెళ్లే రెండవ జట్టుగా అవతరిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news