దీపికా పదుకునే ‘రామ్ లీలా’ మూవీ పాటకు సితార అదిరిపోయే డాన్స్..!

-

దీపికా పదుకునే: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితారకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రత్యేకంగా ఇంస్టాగ్రామ్ లో తనకంటూ ఒక ఎకౌంటును క్రియేట్ చేసుకున్న సితార భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఈ వేదికగా తెలుపుతూ వస్తుంది. తాజాగా సితార దీపిక పదుకొనే పాటకు డాన్స్ చేస్తూ ఆ వీడియోను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

సితార ఘట్టమనేని.. ఇంస్టాగ్రామ్ వేదికగా ఇప్పటికే క్లాసికల్ డాన్స్, సినిమా పాటలకు డాన్స్ చేసి అదుర్స్ అనిపించుకున్న ఈ సెలబ్రిటీ కిడ్.. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకోణె పాటకి స్టెప్పులు వేసి అదరగొట్టేసింది. రామ్ లీల సినిమాలోని ‘నగడ్ సంగ్ ఢోల్’ పాటకి సితార వేసిన డాన్స్ అందరి చేత క్లాప్స్ కొట్టేలా చేస్తుంది.. ఈ వీడియో చూసిన వారంతా తండ్రికి తగ్గ తనయా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల మహేష్ బాబు అతడు సినిమాలోని ‘పిల్ల గాలి అల్లరి’ సాంగ్ కూడా అదిరిపోయే స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే.

కాగా ఇప్పటికే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్న సీతారకు ఇంస్టాగ్రామ్ లో వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉండటం చెప్పుకోదగిన విషయం. అలాగే ఇప్పటికే తన సొంత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన సితార పలు కమర్షియల్ యాడ్స్ లో సైతం నటించి మెప్పిస్తుంది. తన అన్న గౌతమ్ ను ప్రతి విషయంలో డామినేట్ చేసే విధంగా యాక్టివ్ గా ఉంటుంది సితార. అలాగే సితార త్వరలోనే సినిమాల్లో అడుగుపెట్టనుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏమవుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news