ఐపీఎల్ 2023 :కష్టాల్లో రాజస్తాన్ రాయల్స్… శాంసన్ , బట్లర్ & జైస్వాల్ లు అవుట్ !

-

ఈ రోజు గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్యన జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సంజు శాంసన్ సేన కష్టాల్లో ఉంది. ఎప్పటిలాగే బట్లర్ (8) తన దారుణమైన ఫామ్ ను కొనసాగించగా , గత మ్యాచ్ లో సెంచరీ చేసి భీకరమైన ఫామ్ లో ఉన్నా యశస్వి జైస్వాల్ (14) అనూహ్యంగా రన్ ఔర్ అయ్యి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఓవర్ లోనే సంజు శాంసన్ లిటిల్ బౌలింగ్ లో పేస్ ను సరిగా అర్ధం చేసుకోలేక అవుట్ అయ్యాడు. దీనితో కేవలం 63 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇందులో హార్దిక్ పాండ్య , రషీద్ ఖాన్ మరియు లిటిల్ లు తలో వికెట్ తీసుకున్నారు.

ప్రస్తుతం రాజస్థాన్ గట్టెక్కాలంటే ఎవరైనా మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేస్తేనే లేదంటే మ్యాచ్ ఓడిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ ఓడిపోతే టాప్ 4 నుండి కిందకు పడిపోతుంది. మరి రాజస్థాన్ ను ఆదుకునే ఆటగాడు ఎవరన్నది తెలియాలంటే ఇంకాసేపు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news