ఐపీఎల్ 2023: ఒకే ఓవర్లో 3 వికెట్లతో అదరగొట్టిన సుందర్ !

-

ప్రస్తుతం ఢిల్లీ మరియు హైదరాబాద్ జట్ల మధ్యన ఉప్పల్ స్టేడియం లో హోరాహోరీగా మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ వార్నర్ బ్యాటింగ్ తీసుకున్నాడు. కానీ తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఢిల్లీ ఆటగాళ్లు నిలబెట్టుకోవడంలో కాస్త నిరాశ పరిచారనే చెప్పాలి. ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ను ఆడిన ఫిలిప్ సాల్ట్ తొలి ఓవర్ లోనే డక్ అవుట్ గా భువి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వార్నర్ మరియు మార్ష్ లు మ్యాచ్ ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్న సన్ రైజర్స్ బౌలర్లు చెలరేగి వికెట్లు తీసి ఢిల్లీ స్పీడ్ కు బ్రేకులు వేశారు. కాగా ఈ మ్యాచ్ కే హైలైట్ గా 8 వ ఓవర్ నిలిచింది.

 

ఈ ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ ఒకే ఓవర్ లో రెండవ బంతికి వార్నర్ ను, నాలుగవ బంతికి సర్ఫరాజ్ ఖాన్ ను మరియు ఆఖరి బంతికి హకీమ్ ఖాన్ ను అవుట్ చేసి సన్ రైజర్స్ ను ఆకాశానికి ఎత్తేశాడు. ఈ ఒక్క ఓవర్ పూర్తిగా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news