IPL 2024 Auction : షార్ట్ లిస్ట్‌ను ప్రకటించిన బీసీసీఐ.. రేసులో 333 మంది !

-

IPL 2024 Auction కోసం షార్ట్ లిస్ట్‌ను ప్రకటించింది బీసీసీఐ. ఈ నెల 19న దుబాయ్ లో ఐపీఎల్ వేలం జరగనుంది. మొత్తం 10 జట్లలో 77 స్థానాలు ఖాళీగా ఉండగా….. 333 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటున్నారు. అత్యధికంగా కోల్కత్తాలో 12 ఖాళీలు ఉండగా…. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ (9) ఉంది. ముంబై, గుజరాత్, పంజాబ్ లో ఎనిమిదేసి చొప్పున….చెన్నై, లక్నో, బెంగళూరు, హైదరాబాద్ లో ఆరు చొప్పున ఖాళీలు ఉన్నాయి.

IPL 2024 Auction list released, 333 players to go under hammer in Dubai

అన్ని జట్ల పర్స్ వ్యాల్యూ రూ. 262.95 కోట్లుగా ఉంది. కాగా, బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. ఈ నెల 19న జరగనున్న వేళలో పాల్గొనేందుకు అతడు తన పేరును రిజిస్టర్ చేసుకోలేదు. ఐపీఎల్-16లో కేకేఆర్ కు ప్రాతినిధ్యం వహించిన షాకీబ్ కొన్ని మ్యాచులే ఆడారు. గాయంతో సగం టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే. పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమైన అతడు విదేశీ లీగ్ లకు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 71 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన అత డు 793 పరుగులు, 63 వికెట్లు తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news