ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్ బాష్ లీగ్ అనగానే ఎన్నో సంచలనాలకు వేదికగా నిలుస్తు ఉంటుంది. ఆటగాళ్ళ ఆసాధారణ ఫీట్లతో టోర్నీ మొత్తం వినోదాన్ని పంచుతూ ఉంటుంది. కళ్ళు చెదిరే సిక్సులు, ఊహించని క్యాచ్ లు, మెరుపు ఫీల్డింగ్ లు, అసాధ్యమనుకున్న బ్యాటింగ్ ఫీట్లు ఈ టోర్నీ లో మనం చూడవచ్చు. తాజాగా ఇలాంటి ఫీట్ ఏ ఒకటి జరిగింది. బిగ్ బాష్ లీగ్ 2019-20 ఎడిషన్ రెండవ వారంలోకి చేరుకుంది.
ఇప్పటికే ఈ లీగ్ లో అనేక సంచలనాలను అభిమానులు నేరుగా వీక్షించారు. ఆడిలైడ్, మరియు పెర్త్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ రిచర్డ్సన్ బౌండరి లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. అప్పటికే దూకుడుగా ఆడుతున్న అడిలైడ్ బ్యాట్స్మెన్ జేక్ వెదర్‌ల్యాండ్ కేవలం 47 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ యొక్క 15 వ ఓవర్లో వీథెరాల్డ్ క్రిస్ జోర్డాన్ డెలివరీని స్క్వేర్ లెగ్కు ఆడి డబుల్ కి ప్రయత్నించాడు.
అప్పుడు రిచర్డ్సన్ మెరుపు వేగంతో మైదానంలో బౌలింగ్ తరహాలో బంతి విసిరాడు. అది నేరుగా వికెట్లను తాకింది. దీనితో ఫీల్డ్ అంపైర్ రనౌట్ ని థర్డ్ అంపైర్ కి ఇవ్వగా రిప్లై లో అతను అవుట్ అని తేలింది. అతను పది ఫోర్లు మూడు సిక్సులతో 83 పరుగులు చేసాడు. ఈ వీడియో ని బిబిఎల్ యొక్క అధికారిక ట్విట్టర్ ఖాతా ప్రత్యేకమైన రన్-అవుట్ పోస్ట్ చేసింది. అయితే దురదృష్టవ శాత్తు ఈ మ్యాచ్ లో అడిలైడ్ 15 పరుగులతో డక్ వర్త్ లూయిస్ విధానంలో విజయం సాధించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This is something different from Jhye Richardson in the deep!
A run out worthy of a Bucket Moment.#BBL09 | @KFCAustralia pic.twitter.com/l48sK8BQBw
— KFC Big Bash League (@BBL) December 23, 2019