ఐర్లాండ్ క్రికెట్ జట్టులో చాలా దూకుడుగా ఆడే ఆటగాడు కెవిన్ ఓ’బ్రేయిన్. అతని ఆట చూసిన ఎవరు అయినా సరే ఫిదా కావాల్సిందే. ఇంగ్లాండ్ లాంటి ఎంతగానో బలమైన జట్టుకి తన ఆట తీరుతో మూడు చెరువుల నీళ్ళు తాగించాడు. ఇప్పుడు అతను చేసిన ఒక పని అతనిని బాధ పెట్టేసింది బాగా. ఐర్లాండ్లో జరిగిన ఇంటర్-ప్రావిన్షియల్ టి 20 మ్యాచ్ సందర్భంగా, లీన్స్టర్ మెరుపుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ’బ్రియన్ ఒక భారీ సిక్సర్ కొట్టాడు.
బంతి స్టేడియం మీదుగా వెళ్లి అతని కారుకి గట్టిగా తగిలింది. క్రికెట్ ఐర్లాండ్ వారి అధికారిక ట్విట్టర్ ప్రొఫైల్లో పగిలిన కారుని పోస్ట్ చేసింది. కేవలం 37 బంతుల్లో 82 పరుగులు చేశాడు. అతను ఇన్నింగ్స్ అంతటా 3 ఫోర్లు మరియు 8 సిక్సర్లు కొట్టాడు, అతని జట్టు 24 పరుగుల విజయాన్ని సాధించింది. కారు అద్దం పూర్తిగా పగిలింది.
📸: KEVIN O’BRIEN SMASHES SIX…
…and his own car window. Seriously.#IP2020 | @TestTriangle ☘️🏏 pic.twitter.com/dKbfDRHrjY
— Cricket Ireland (@Irelandcricket) August 27, 2020