ప్రపంచంలో కోహ్లీకి ఇంత క్రేజ్ ఉందా…?

-

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కి ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక భారత్ లో అయితే క్రికెట్ అనేది ఒక నిత్యావసరంగా మారింది అంటే దానికి ఉండే ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకొచ్చు. ఇక మన క్రికెటర్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ఇంటర్నెట్ లో మన వాళ్ళ హవా ఎక్కువగా ఉంటుంది. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అంతా ఇంతా క్రేజ్ కాదు.

ఇదిలా ఉంటే తాజాగా టీం ఇండియా ఆటగాళ్ళు ఒక అరుదైన రికార్డ్ సాధించారు. 2015 డిసెంబరు -2019 డిసెంబరు మధ్యకాలంలో కోహ్లి గురించి ప్రపంచవ్యాప్తంగా నెలకు సగటున 1.76 మిలియన్ సార్లు సెర్చ్ చేసారట. దీనితో గత నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెటర్‌గా అగ్రస్థానంలో నిలిచాడు. SEMరష్ అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కోహ్లీ తర్వాత ఇంటర్నెట్‌లో ధోని గురించి,

నెలకు సగటున 9.39 లక్షల సార్లు వెతికినట్లు సంస్థ వెల్లడించింది. టాప్-10 ఆటగాళ్ల జాబితాలో ఏడుగురు క్రికెటర్లు ఉన్నారంటే మన వాళ్లకు ఉండే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రోహిత్ శర్మ(7.33 లక్షలు), నాలుగో స్థానంలో సచిన్ టెండుల్కర్(4.51 లక్షలు), హార్దిక్ పాండ్య(3.68 లక్షలు), యువరాజ్ సింగ్(3.48 లక్షలు) కోసం ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశారు. టాప్-10లో విదేశీ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news