భారీ స్కోర్ చేసిన ముంబై.. లక్నో టార్గెట్ ఎంతంటే..?

-

ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య హోరా హోరీ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 12 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ రికెల్టన్ 58 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే విల్ జాక్స్ 29 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడి 28 బంతుల్లో 54 పరుగులు చేశాడు.

తిలక్ వర్మ 6 పరుగులు మాత్రమే చేసి అనవసర షాట్ కొట్టి ఔట్ అయ్యాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం 5 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. చివర్లో నమన్ చాకచక్యంగా ఆడాడు.  దీంతో ముంబై  215 పరుగులు చేసింది.  216 పరుగుల లక్ష్యంతో లక్నో బరిలోకి దిగనుంది.  ఇక లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మయాంక్ యాదవ్ 2, ప్రిన్స్ యాదవ్ 1, రవి బిష్ణోయ్ 1, ఆవేశ్ ఖాన్ 1 వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news