టీం ఇండియా సెలెక్షన్ కమిటీ కీలక సమావేశం…!

ఆస్ట్రేలియా పర్యటన కోసం టీం ఇండియాను నేడు ప్రకటిస్తుంది భారత సెలెక్షన్ కమిటీ. ఈ మేరకు సెలెక్షన్ కమిటీ సమావేశం కానుంది. టీం ఇండియా నూతన సెలెక్టర్ సునీల్ జోషి నేతృత్వంలోని కొత్త సెలక్షన్ కమిటీకి ఇది మొదటి ప్రధాన సమావేశం అవుతుంది. ప్రస్తుతం టీం ఇండియాలో కీలక ఆటగాళ్ళు అందరూ కూడా ఐపిఎల్ ఆడుతున్నారు. డిసెంబర్ ఆరు నుంచి ఈ పర్యటన మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇది సుదీర్ఘ పర్యటన కావడంతో టీం ఇండియా ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ఎంపిక చేయనున్నారు. టెస్ట్, వన్డే, టి20 జట్లకు టీం లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో టీం ఇండియా డే అండ్ నైట్ టెస్ట్ కూడా ఆడే అవకాశం ఉంది. యువ ఆటగాళ్ళ ఎంపికపై ఆసక్తి నెలకొంది.