ఈ ఐపిఎల్ హీరో ఆ కుర్రాడే…!

దాదాపు రెండు నెలల నుంచి అభిమానులను ఎంతగానో అలరించిన ఐపిఎల్ మ్యాచ్ లు ముగిసాయి. ఫైనల్ మ్యాచ్ లో ముంబై మంచి విజయం సాధించింది. అయితే ఈ సీజన్ లో ముంబై ఆటగాడు ఇషాన్ కిషన్ సంచలనం అయ్యాడు. ముంబై యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మాన్ ఈ సీజన్ లో అదరగొట్టాడు. గత సీజన్స్ లో నిలకడ లేక నానా ఇబ్బందులు పడే వాడు. కానీ ఈ సంవత్సరం, కిషన్ 53.66 సగటుతో 483 పరుగులు చేసాడు.

144 స్ట్రైక్ రేటు నమోదు చేసాడు. ధోనీ రిటైర్ అయిన తర్వాత ఆ స్థానంలోకి ఎవరు వస్తారు అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ తరుణంలో ఈ యువ ఆటగాడు సత్తా చాటాడు. ఢిల్లీ ఆటగాడు పంత్ ఘోరంగా విఫలమైన తరుణంలో కిషన్ చాలా బాగా ఆకట్టుకున్నాడు. అత్యధిక సిక్స్ లు బాదిన ఆటగాడిగా కూడా నిలిచాడు.