ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌లో రెండో స్థానంలో నిలిచిన నీరజ్‌ చోప్రా

-

ఇటీవలే ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న ఇండియన్ గోల్డెన్ బాయ్, స్టార్‌ జావెలిన్ త్రో ప్లేయర్​ నీరజ్‌ చోప్రా.. తాజాగా జరిగిన ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌ వేదికగా జరిగిన ఈ డైమండ్‌ లీగ్‌ పోటీల్లో స్వర్ణం సాధిస్తాడని అందరూ భావించినాకీ.. రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 80.70 మీటర్ల దూరం విసిరిన నీరజ్​.. ఆ తర్వాత రెండు, మూడు ప్రయత్నాల్లో ఫౌల్‌ అయ్యాడు. నాలుగు ప్రయత్నంలో 85.22 మీటర్లు విసిరి.. రెండో స్థానంలోకి వచ్చి .. ఐదో ప్రయత్నంలో మరోసారి ఫౌల్‌ అయ్యాడు. చివరి ప్రయత్నంలో 85.71 మీటర్లు విసిరాడు. మరోవైపు ఈ డైమండ్​ లీగ్​లో తొలి స్థానంలో జాకబ్‌ వాడ్లెజ్‌ (85.86) నిలిచాడు. ఈ సీజన్ డైమండ్‌ లీగ్‌ల్లో భాగంగా మే 5వ తేదీన దోహాలో, జూన్‌ 30న లౌసానేలో నీరజ్‌ చోప్రా అగ్రస్థానం సాధించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news