దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా శనివారం ఆరంభమైన మూడో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ జట్టుకి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే భారత్ గడ్డపై టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా టీమ్ కష్టాలు రాంచీలోనూ కొనసాగేలా కనిపిస్తున్నాయి. ఈ రోజు మ్యాచ్ ప్రారంభమైన కాసేపట్లోనే భారత్ రెండు వికెట్లను చేజార్చుకుంది.
టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్(10) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరితే, రెండో వికెట్‌గా చతేశ్వర్ పుజారా ఔటయ్యాడు. స్తుతం క్రీజులో రోహిత్ శర్మ (7), విరాట్ కోహ్లి (8) ఉండగా.. 12 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 25/2తో కొనసాగుతోంది. సఫారీ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ.. కేవలం 4 పరుగుల వ్యవధిలోనే మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారాలను పెవిలియన్ బాట పట్టించాడు.