ICUలో రాహుల్‌ ద్రవిడ్‌..BCCI క్లారిటీ !

-

టీం ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఈ విషయాన్ని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాటోర్ ధృవీకరించారు. ఈడెన్ గార్డెన్స్ లో రెండో వన్డే ముగియగానే, అనారోగ్యం కారణంగా ద్రవిడ్ బెంగుళూరు వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి.

దీంతో ద్రవిడ్ ఆరోగ్యంపై ఆందోళనలు మొదలయ్యాయి. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్స్ మైదానంలో నేడు శ్రీలంకతో జరగనున్న చివరి వన్డే కు అందుబాటులో ఉండరన్న ప్రచారం జరిగింది. దీనిపై విలేకరుల ప్రశ్నలకు రాటోర్ స్పందిస్తూ, ఆయన నిక్షేపంగా ఉన్నారు బాస్. ఈ వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో నాకు తెలియదు. ద్రవిడ్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news