టీమిండియా వచ్చే నెలలో.. శ్రీలంక జట్టుతో.. టెస్టు మ్యాచ్ లు ఆడనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ టెస్టు మ్యాచ్ లకు.. టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైఎస్ కెప్టెన్ గా.. ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాను నియమిస్తూ.. బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
అయితే.. వీరిద్దరూ కేవలం ఈ శ్రీలంక సిరీస్ కు మాత్రమే కెప్టెన్, వైఎస్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. అలాగే…. శ్రీలంకతో టెస్టు, టీ20 సిరీస్‌లకు శార్దూల్ ఠాకూర్‌కు విశ్రాంతిని ఇచ్చింది బీసీసీఐ. అటు శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లి, రిషబ్ పంత్‌లకు విశ్రాంతినించింది బీసీసీఐ పాలక మండలి.
శ్రీలంకతో టెస్టు సిరీస్ నుంచి అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారాలను తప్పించింది శ్రీలంక జట్టు. ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ ప్రకటన చేశారు.ఇప్పటికే టీమిండియా వన్డే కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను.. టెస్టు కెప్టెన్ గా చేయడం అందరినీ షాక్ గురిచేస్తుంది.