IPL 2024: ధోనీ అభిమాని తల పగలగొట్టిన రోహిత్ శర్మ ఫ్యాన్స్ !

-

IPL 2024: IPL 2024 చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ టోర్నమెంట్‌ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫ్యాన్స్ కాస్త అతి చేశారు. ధోనీ అభిమాని తల పగలగొట్టారు రోహిత్ శర్మ ఫ్యాన్స్. ఈ సంఘటన మహారాష్ట్ర జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Rohit Sharma fans who broke the head of Dhoni fan

మహారాష్ట్ర కొల్హాపూర్‌లో SRH VS MI మ్యాచ్లో రోహిత్ శర్మ ఔట్ కావడంతో ధోనీ అభిమాని బండోపంత్ టిబిలే(63) “రోహిత్ ఔటైపోయాడు, ఇప్పుడు ముంబై ఎలా గెలుస్తుంది” అంటూ హేళన చేశాడు. దీంతో కోపంలో రోహిత్ ఫ్యాన్స్ బల్వంత్, సాగర్ టిబిలే తలపై కర్రతో కొట్టారు.. ప్రస్తుతం టిబిలే పరిస్థితి విషమంగా ఉంది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news