కార్తీక్ ను కిస్ చేసిన రోహిత్ శర్మ..వీడియో వైరల్

-

హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. హైదరాబాద్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌ లో ఓ అరుదైన ఘటన జరిగింది.  ఈ మ్యాచ్‌ 8వ ఓవర్ లో చాహల్ బౌలింగ్ కు దిగాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని మాక్స్ వెల్ ఫైన్ లెగ్ దిశగా బాదాడు.

బౌండరీ వద్ద అద్భుతంగా బాల్ అందుకున్న అక్షర్ పటేల్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్ట్రైకర్ ఎండ్ వైపు బాల్ విసిరాడు. అయితే రెండో రన్ కోసం ప్రయత్నిస్తున్న మ్యాక్సీ ఆ బంతి నేరుగా వికెట్లను తాకుతుందని అస్సలు ఊహించి ఉండడు. అందుకే డైవ్ దూకలేదు. ఇక దినేష్ కార్తీక్ సైతం తోలుత గ్లవ్స్ వికెట్లకు తాకించడంతో ఒక బెయిల్ ముందే లేచింది.

అయితే బాల్ నేరుగా వచ్చి వికెట్లకు తాకడంతో రెండో బెయిల్ కూడా లేచింది. దీంతో ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. అంతే స్టేడియం హోరెత్తింది. మ్యాక్సీ కంగుతిన్నాడు. ఈ అవుట్ అనంతరం రోహిత్ మరోసారి డీకే తో సరదాగా వ్యవహరించాడు. కీపర్ దినేష్ కార్తీక్ ముందే గ్లోవ్స్ వికెట్ల తాకించడంపై కాస్త సీరియస్ అయినట్లు కనిపించిన, తర్వాత అవుట్ అని స్టేడియం డిస్ప్లే పై కనిపించగానే వెంటనే నవ్వుకుంటూ వచ్చి డీకే హెల్మెట్ ముద్దాడాడు. ఈ వీడియో వైరల్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news