దక్షిణాఫ్రికాతో తాజాగా ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌ని 3-0తో చేజిక్కించుకోవడం ద్వారా 120 పాయింట్లని ఖాతాలో వేసుకున్న టీమిండియా.. మొత్తం 240 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. కాగా, 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో తొలిసారి టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడిన రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును సాధించాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో రోహిత్(212) డబుల్ సెంచరీ సాధించడంతో ఒక అరుదైన ఫీట్‌ను నమోదు చేశాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు రెండు వేర్వేరు ఇన్నింగ్స్‌ల్లో నమోదు చేసిన స్కోరు కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఐదో భారత్ ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు ఆలౌటైతే, రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే చాపచుట్టేసింది. దాంతో రోహిత్ చేసిన పరుగుల్ని కూడా సఫారీలు తమ ఇన్నింగ్స్‌లో సాధించలేకపోయారు. అంతకుముందు ఈ ఘనత సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో వినూ మన్కడ్(231-న్యూజిలాండ్‌పై) తొలిసారి ఈ మార్కును చేరగా, ఆపై రాహుల్ ద్రవిడ్(270- పాకిస్తాన్‌పై) రెండో స్థానంలో ఉన్నాడు. ఒక మూడు స్థానంలో సచిన్ టెండూల్కర్(248-బంగ్లాదేశ్‌పై), నాల్గో స్థానంలో విరాట్ కోహ్లి(243-శ్రీలంకపై)లు ఉన్నారు.