Team india: ఎల్గర్ కు టీమిండియా స్పెషల్ గిఫ్ట్..

-

Rohit Sharma : రిటైర్ అవుతున్న సౌత్ఆఫ్రికా క్రికెటర్ డీన్ ఎల్గర్ కు టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత జెర్సీని బహుకరించి స్నేహపూర్వక మనసు చాటుకున్నారు. ఆ జెర్సీపై భారత జట్టు సభ్యులు ఆటోగ్రాఫ్ లు చేశారు. కాగా, డీన్ ఎల్గర్ తన కెరీర్ లో 85 టెస్టులు ఆడారు.

Rohit Sharma, Virat Kohli Gift Signed Indian Jerseys to Dean Elgar on Farewell Test

14 సెంచరీలు, 53 అర్ధ సెంచరీల సాయంతో 5331 పరుగులు సాధించారు. అలాగే 8 వన్డేలు ఆడి 104 రన్స్ చేశారు. 2018లో చివరి వన్డే ఆడగా…. ఇవాళ చివరి టెస్టు ఆడేశారు. కాగా, కొత్త సంవత్సరం మొద‌లైన 4 రోజుల్లోనే టీమిండియా అదిరిపోయే బోణీ కొట్టింది. వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వన్ గా సౌత్ ఆఫ్రికా గ‌డ్డ‌పై అడుగుపెట్టిన రోహిత్ సేన కీల‌క‌మైన కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన చివరి టెస్టులో చిరస్మ‌ర‌ణీయ విజ‌యం సాధించింది. రెండు టెస్టుల‌ సిరీస్‌ను స‌మం చేసి 12 కీల‌క పాయింట్లు సాధించింది. దాంతో, ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌షిప్-25 టేబుల్ లో మ‌ళ్లీ మొదటి స్థానానికి చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news