IND VS RSA : సఫారీల గడ్డపై చరిత్ర సృష్టించిన భారత్

-

IND VS RSA : సఫారీల గడ్డపై చరిత్ర సృష్టించింది భారత్. సౌత్ ఆఫ్రికాపై రెండో టెస్టులో విజయం సాధించిన టీం ఇండియా అరుదైన రికార్డు సృష్టించింది. కేప్ టౌన్ లో ఆసియా నుంచి టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి జట్టుగా అవతరించింది. ఇదే పర్యటనలో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ సమం కాగా వన్డే సిరీస్ ను భారత జట్టు 2-1 తేడాతో సొంతం చేసుకుంది. మొత్తంగా ఈ పర్యటనలో ఆతిథ్య సౌతాఫ్రికాపై భారత్ పైచేయి సాధించింది.

india crazy record in RSA
india crazy record in RSA

కాగా, రిటైర్ అవుతున్న సౌత్ఆఫ్రికా క్రికెటర్ డీన్ ఎల్గర్ కు టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత జెర్సీని బహుకరించి స్నేహపూర్వక మనసు చాటుకున్నారు. ఆ జెర్సీపై భారత జట్టు సభ్యులు ఆటోగ్రాఫ్ లు చేశారు. కాగా, డీన్ ఎల్గర్ తన కెరీర్ లో 85 టెస్టులు ఆడారు. 14 సెంచరీలు, 53 అర్ధ సెంచరీల సాయంతో 5331 పరుగులు సాధించారు. అలాగే 8 వన్డేలు ఆడి 104 రన్స్ చేశారు. 2018లో చివరి వన్డే ఆడగా…. ఇవాళ చివరి టెస్టు ఆడేశారు.

Read more RELATED
Recommended to you

Latest news