128 పరుగులు చేస్తే, సచిన్ తర్వాత రోహిత్…!

-

శ్రీలంకతో జరిగిన మూడు టి20 మ్యాచుల సీరీస్ ని 2-0తో కైవసం చేసుకున్న టీం ఇండియా ఆస్ట్రేలియాతో బుధవారం నుంచి జరగనున్న వన్డే సీరీస్ కి సిద్దమైంది. ఇరు జట్ల మధ్య ముంబై వేదికగా మొదటి వన్డే జరగనుంది. స్వదేశంలోవరుసగా మ్యాచ్ లు గెలిచి దూకుడు మీద ఉన్న టీం ఇండియా ఈ మ్యాచ్ లో గెలిచి ఊపుని కొనసాగించాలని భావిస్తుంది. ఇక ఈ మ్యాచ్ ద్వారా టీం ఇండియాలో,

కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో ముగ్గురు ఓపెనర్లు బరిలోకి దిగే అవకాశం ఉంది. కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఈ మ్యాచ్ లో ఆడే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ ద్వారా ఇండియా-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ళలో,

రోహిత్ శర్మ రెండో స్థానానికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సచిన్ టెండూల్కర్ – 71 మ్యాచ్‌ల్లో 44.59 సగటుతో 3077 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉండగా, రికీ పాంటింగ్ – 59 మ్యాచ్‌ల్లో 40.07 సగటుతో 2164 పరుగులు చేయగా రోహిత్ శర్మ 37 మ్యాచ్‌ల్లో 61.72 సగటుతో 2037 పరుగులు చేసాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ – 37 మ్యాచ్‌ల్లో 1727 పరుగులు చేయగా ఎంఎస్ ధోని 55 మ్యాచ్‌ల్లో 1660 పరుగులు చేసాడు. రోహిత్ శర్మ మరో 128 పరుగులు చేస్తే పాంటింగ్ ని దాటి రెండో స్థానానికి వస్తాడు.

Read more RELATED
Recommended to you

Latest news